Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు
- పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు
- అక్రమంగా రీఫిల్ చేస్తున్న గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
- జిల్లా ఇన్చార్జ్ టాస్క్ ఫోర్స్ అధికారి వెంకటేశం
నవతెలంగాణ-తాండూరు రూరల్
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మోమిన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి అధికారి వెంకటేశం అన్నారు మంగళవారం సమాచారం మేరకు జిల్లా ఎస్పి కోటి రెడ్డి , ఆదేశాల మేరకు జిల్లా లోని టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు ఆక్రమార్కుల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై లక్ష్యం దాడులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ అధికారులు పలు చోట్ల దాడులు చేశారు. కరన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ పరిధిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు అనే పక్క సమాచారం తో దాడి చేయగా పేకాట ఆడుతున్న 17 మంది నుండి 10 బైక్‌లు, 15 సెల్ ఫోన్లు, రూ. 7,660/- నగదు స్వాధీనం చేసుకొని కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఇట్టి వారిపైన పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్, వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలలో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్నారు అనే పక్క సమాచారం తో నేడు దాడులు నిర్వహించగా అందుకుగాను ఉపయోగించే 09 అనుబంధ సిలిండరు, 27 చిన్న సిలిండర్లు తాండూర్ టౌన్ లో లభించాయి. ఇట్టి వారిపైన తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వికారాబాద్ టౌన్లో దాడులు చేయగా గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కోసం ఉపయోగించే 11 సిలిండర్ లను సీజ్ చేశారు. ఇట్టి వారిపైన వికారాబాద్ టౌన్లో కేసు నమోదు చేశారు. ఇట్టి టాస్క్ ఫోర్స్ టీమ్‌కు మోమిన్ పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం ఇన్చార్జ్కి జిల్లా ప్రజలు ఏమైనా సమాచారం ఉంటే 9492009094 నెంబర్ సమాచారం ఇవ్వాలన్నారు.