Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమనగల్ మార్కెట్ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి
- దేవునిపడకల్‌లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్
ఆటల పోటీలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించిన వారే అసలైన క్రీడాకారులని ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి మెన్స్, ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ వాలీబాల్ పోటీలను మంగళవారం స్థానిక ఎస్ఐ శివశంకర్ వరప్రసాద్‌తో కలిసి మార్కెట్ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సందర్భాల్లో గ్రామాల్లో నిర్వహించే ఆటల పోటీలు యువతి యువకుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి దోహదపడ్తాయన్నారు. అదేవిధంగా వారిలో స్నేహా భావం పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు సర్పంచ్ కాడెమోని శ్రీశైలం, వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ కాన్గుల మల్లేష్, ఉపసర్పంచ్, వాలీబాల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాజమోని తిరుపతి తదితరులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాల సందర్భంగా గత 16 సంవత్సరాలుగా జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో ప్రతిభ కనబర్చిన బృందాలకు నగదు పురస్కారంతో పాటు షీల్డులు అందజేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎల్.మధు కుమార్ రెడ్డి, ఎల్.రంజిత్ కుమార్ రెడ్డి, గుజ్జరి రాఘవేందర్, మద్దూరి సత్యనారాయణ, కె.రవి, గణేష్, పి.మహేష్, ఎం.వెంకటేష్, రాజు, బాలకృష్ణ, పీఈటీ మల్లేష్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.