Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డ్, ఈ -శ్రమ్ కార్డ్ దరఖాస్తు చేసుకునే శిబిరాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న అర్హ్వులందరికీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షలతో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అర్హులకు ఇస్తుంది. దేశ వ్యాప్తంగా వేలాది నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ పథకం కింద హెల్త్ కార్డ్ ఉన్నవారికి చికిత్స చేస్తారని, అందరూ అప్లై చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ప్రభాకర్ యాదవ్, హరి కృష్ణ, మధు యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మహిళ మోర్చ నాయకులు పద్మ, రేణుక రమాదేవి, బీజేవైఎం నాయకులు హరిప్రియ, ఆనంద్, శ్రీధర్, విజరు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.