Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- రాళ్ల చిట్టెంపల్లి గ్రామం 'మీతో నేను' కార్యక్రమం
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ప్రజా సమస్యలను ప్రజల సమక్షంలోనే ఎక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేస్తున్నానని వికారాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.మంగళవారం ఎమ్మెల్యే ఆనంద్ 'మీతో- నేను' కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిట్టెంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చనుగొంల యాసిన్ గౌస్ తోకలిసి పర్యటించారు. గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎక్కడికక్కడే ఆయా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. అంతర్గత రోడ్ల వెంబడి ఉన్న మురుగు కాలువలలో మిషన్ భగీరథ పైపులు తొలగించి, గ్రామంలో మిషన్ భగీరథ నీరు ప్రతి వార్డులో ప్రతి ఇంటికి ఇవ్వాలని, ప్రజలు నల్లాలకు బిగించిన చెర్రలు తీయకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలన్నారు, నూతనంగా ఏర్పాటైన కాలనీలో కొత్త స్థంబాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో, పంట పొలాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారులు కృషి చేయాలని తెలిపారు. రైతువేదికల్లో వ్యవసాయ శాఖ అధి కారులు వారానికి ఒకసారి రైతులకు అందుబాటులో ఉండి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయా లన్నారు. ఆయన మాట్లాడుతూ వికారాబాద్ మండ లంలో మెగా వాటర్ షెడ్‌ను ఏర్పాటు చేయించడం జరిగిందని క్లస్టర్లో ఉన్న 7 గ్రామాలకు ఉపయోగ పడుతుందన్నారు. పశువుల డాక్టర్ వారానికి ఒకసారి ఉదయం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని, పశువుల స్టాండ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు మూఢనమ్మకాలు లేకుండా 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకాలు ఇప్పించాలన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.