Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దోమ
కల్యాణ లక్ష్మీ పథకం పేద ప్రజలకు వరంలాంటి దని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాల యంలో 39 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కుల ను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరమని, ఆడపిల్లల పెండ్లీలు తల్లిదం డ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగి రడ్డి, ఎంపీపీ అన సూయ, వైస్ ఎంపీపీి మల్లేషం, తహ సీల్దార్ షాహీదా బేగం, ఉపతహసీల్దార్ రాజేందర్ రెడ్డి, కో అప్షన్ ఖాజా పాష, ఆర్ఐ లింగం, సర్పంచులు రాజి రడ్డి, యాదయ్య సాగర్, యశోద తిరుపతయ్య సాగర్, అమృతమ్మ ఆంజనేయులు, రైతుబంధు అధ్యక్షులు లక్ష్మ య్య, ఎంపీ టీసీలు నర్సింలు, రాములు, అనిత యాద య్యగౌడ్, నాయకులు రాఘవేందర్ రెడ్డి, దోమ మండల ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.