Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
నవతెలంగాణ- మొయినాబాద్
ఈ నెల 28, 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ పిలుపు నిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని మొయి నాబాద్ జీపు జాత నిర్వహించారు. ఈ జాతకు ముఖ్య అతిథిగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 28, 29 తేదీలలో నిర్వహించే జాతీయ సమ్మె మొయినాబాద్, చేవెళ్ల ల్లో విజయవంతం చేయాలన్నారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రజలు ఉపాధి కోల్పోయి తిండి దొరకక, ఆరోగ్య సదుపాయాలు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆదాయం లేకుండా మరింత పేదరికంలో పడ్డారని కానీ బడా కార్పొరేట్ల ఆదాయం లక్షల కోట్లకు చేరిందని దీన్నిబట్టి బీజేపీ ప్రభుత్వం ఎవరి సంక్షేమం కోసం పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పేదలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, మేధావులు, అందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమా ర్, జిల్లా నాయకులు దేవేందర్, మొయినాబాద్ మం డల కన్వీనర్ ప్రవీణ్, భవన నిర్మాణ కార్మికులు నర్సిం లు, వెంకటప్ప, సీఐటీయూ మండల నాయకులు చంద్రశేఖర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.