Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-మర్పల్లి
ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో సబితా ఆనంద్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని వికారాబాద్, ధరూర్, మర్పల్లి, కోట్‌పల్లి, మోమిన్‌పేట్, బంట్వారం మండలాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వారిచే వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిరుద్యోగులు వారి పేర్లను సంబంధిత మండలాల పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందజేయన్నుట్టు తెలిపారు. మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేయన్నుట్టు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ ఆనంద్ ఫౌండేషన్ వారు కోరారు.