Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బంట్వారం
మండల పరిధి లోని తొర్మామిడి గ్రామ ంలోని మోరీలల్లో మురుగు నీరు నిలిచి పోయి దుర్గంధం వెదజల్లుతున్నా సర్ప ంచ్ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెలలు గడుస్తున్నా గ్రామంలో పారిశుధ్యం కరువై పోయిందని, మోరీలలో మురుగు నీరు తీయిం చాలని అంటున్నారు. మోరీల్లో వ్యర్థాలతో మురుగునీరు ఎక్కువై దోమలు విజృంభిస్తు న్నాయని, దీంతో డెంగ్యు, మలేరియా వంటి రోగాలతో ఆస్పత్రుల పాలవుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. మోరీలో పేరుకుపోయిన, వ్యర్థాలను మురుగు నీరుని శుద్ధి చేయించి గ్రామాన్ని పరిశుధ్యంగా ఉంచాలని పలు మార్లు సర్పంచ్‌కు తెలిపినా పట్టించు కోలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ స్పందిం చి పేరుకు పోయిన మురుగు నీరుని తీయిం చాలని ప్రజలు కోరుతున్నారు.