Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ మధుసూధన్
నవతెలంగాణ-మహేశ్వరం
ఏటీఎం చోరీ కేసులో ఐదుగురి యువకులను బుధవారం రిమాండ్కు తరలించినట్టు సీఐ మధుసూధన్ తెలిపారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివ రాలు వెల్లడించారు. ఈనెల 19న బీఎన్ఆర్ పౌల్ట్రీ ఫాంలో పనిచేసే ఒరిస్సా యువకులు యజమాని లేని సమయంలో అదును చూసి టాటా ఏసీ ట్రాన్స్ పోర్టు వాహనాన్ని దొంగి లించారు. మహేశ్వరంలోని ఐసీఐసీఐ ఏటీఎంను పగుల గొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడానికి ప్రయ త్నించారు. ఏటీఎం ముందు డోరును పగుల గొడుతుండగా సైరన్ మోగడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం మన్సాన్పల్లి వద్ద ఐదుగురిని పట్టుకొని విచారించగా నేరం రుజువు కావడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.