Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ కోర్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- నేడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రైతాంగం మేలు కోసం ఎంతవరకైనా పోరాడతామని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన నియోజవర్గ టీఆర్ఎస్ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగానికి మద్దతుగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నేడు నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గురువారం కళ్లెం జంగారెడ్డి గార్డెన్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నదని విమర్శించారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రైతు పండించిన పంటలకు మద్దతు ధరలను నిర్ధారించి, పంటలను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పంజాబ్ రాష్ట్ర రైతుల నుండి రెండు పంటల వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణ రైతుల నుండి ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల నుండి వడ్లు కొనాలని, లేకుంటే అన్నదాతల ఆగ్రహానికి బిజేపి గురికావాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, ఎంపీపీలు కృపేష్, నర్మదా, జెడ్పీటీసీ చిన్నోల్ల జంగమ్మ, చైర్ పర్సన్లు చెవుల స్వప్న, కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, చీరాల రమేష్, కిషన్ గౌడ్, భాస్కర్ రెడ్డి, బహదూర్, భాష, మున్సిపల్ అధ్యక్షులు శిద్దెంకి కృష్ణారెడ్డి, కొప్పు జంగయ్య, అమరేందర్ రెడ్డి, అల్వాల వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.