Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై ఉద్యమాలు
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్
- ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నిరంతరం నిర్వహించే పోరాటాకలు భగత్‌సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 91వ వర్ధంతిని పురష్కరించుకుని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని డాక్‌బంగ్లాలో మెగా మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది. యువకులు అధిక సంఖ్యలో రక్త దానం చేశారు. జర్నలిస్టులు సైతం అధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన ధీరుడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లని కొనియాడారు. పేదలందరికీ విద్యా, వైద్యం, ఉపాధి అందుబాటులోకి రావాలన్నారు. అసమానతలు తొలగి, అందరూ సమానంగా జీవించాలని కోరారు. కానీ పాలకుల విధానాల వల్ల ఇంకా అకలి,పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే ఆ మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారని చెప్పారు. భగత్‌సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. రాబోయే తరానికి వారి త్యాగం స్ఫూర్తిని అందిస్తుందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ... దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని కోరిన మొట్టమొదటి ఉద్యమకారుడు భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్ భావజాలమంటే నేటి మన పాలకులకు కూడా భయం పుడుతుందని, అందుకే వారి గురించి పాఠ్యాంశాల్లో చేర్చడం లేదని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో నేటి పాలకులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. భగత్‌సింగ్ జీవితాన్ని అందరూ చదవాలన్నారు. భగత్ సింగ్ బాటలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లిమ్స్ వైద్యులు రామరాజు, మంచాల మాజీ జెడ్పీటీసీ పి.యాదయ్య, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు బి.శంకర్, ఎస్.రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి.జగన్, ఎ.జంగయ్య, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శులు డి.కిషన్, డి.జగదీశ్, ఎం.ప్రకాశ్ కారత్, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి గడ్డం గణేష్, డీవైఎఫ్ఐ నాయకులు చందు, ఎస్ఎఫ్ఐ నాయకులు మస్కు చరణ్, మద్దెల శ్రీకాంత్, గుండె శివకుమార్, విప్లవ్ కుమార్, లిఖిత్‌కుమార్, ఆలంపల్లి సాయికిరణ్, ఏర్పుల తరంగ్, సీహెచ్.వినోద్‌కుమార్, డీవైఎఫ్ఐ నాయకులు ఆర్.స్వామి, ఎ.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.