Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-మీర్పేట్
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెజాన్ సౌజన్యంతో బాలవికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను మంత్రి ్డబుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్లలో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి కార్పొరేట్ పాఠశాలలు తలదన్నేలా చేస్తున్నామని తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాల్ ద్వారా విద్యార్థులకు సందేశం అందించారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కోసం అమెజాన్, బాలవికాస్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి కంప్యూటర్ ల్యాబ్స్ ఇతర సౌకర్యాలు కల్పించటం చాలా గొప్ప విషయం అని వారిని అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు, ఎంఇఓ కృష్ణయ్య, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అమెజాన్, బాలవికాస్ సంస్థల ప్రతినిధులు, ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.