Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసేవయే పరమావధిగా పరోపకారం
- అధిష్టాన గుర్తింపు కోసం అభిమానుల ఎదురుచూపు
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నా అంటూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న నేత గోలి శ్రీనివాస్‌రెడ్డి. ప్రజలే దేవుళ్ళుగా నమ్మి పదవులు లేకున్నా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజా సేవయే పరమావధిగా పరోపకారం చేస్తున్న గోలి సేవలను అధిష్టాన గుర్తింపు కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా (ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి) నియోజకవర్గంలో అనేక సేవాకార్యక్రమాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. కులమతాలకు, వర్గవిభేదాలకు అతీతంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న గోలికి నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో అభిమానులు ఉన్నారు. నియోజకవర్గంలోని నారాయణ పూర్ గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నాయకులుగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు స్వంత ఖర్చులతో అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం, తాగునీటి ఎద్దడి నివారణ, ఆపదలో ఉన్న వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, మతుల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందజేయడం లాంటి అనేక సేవా కార్యక్రమాలకు గోలి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించి 2013లో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధితో పాటు ఎన్నికలు ఏవైనా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తితో వీధిన పడిన నిరుపేద కుటుం బాలను గుర్తించి వారికి సొంత డబ్బులతో నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్నారు. నియోజక వర్గంలో గ్రూపు విభేదాలు బుసలు కొడుతున్న అవేవి పట్టించుకోకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలందరితో కలివిడిగా ఉంటూ వారిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలతో సత్సంబంధాలు కలిగి ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో గోలి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈనేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటి వరకు కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి అన్ని తానై అండగా నిలిచిన రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి శ్రమను ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పించాలని కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.