Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద జరుగుతున్న అప్పా చెరువు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిహెచ్ఎంసి ప్రాజెక్టు అధికారులతో కలిసి ఎమ్మెల్యే అప్ప చెరువు వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ రూ.8.4 కోట్ల రూపాయలతో 550 మీటర్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం జరుగుతున్న బాక్స్ డ్రైన్ మరియు రూ.1.5 కోట్లుతో నాల అలుగు పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అన్నారు. పనుల్లో నాణ్యత పాటించకపోతే సహించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. జాతీయ రహదారిపై ఇలాంటి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఖాజా, సరికొండ వెంకటేష్ ,స్థానిక నేతలు పాల్గొన్నారు.