Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ డీఎస్పీ మల్లారెడ్డి
నవతెలంగాణ-బొంరాస్పేట్
బొంరాస్పేట్ మండలంలోని వివిధ తాండలలో గుడుంబాతో పాటు గంజాయిని సంపూర్ణంగా నిషేధించాలని వికారాబాద్ ఎక్సైజ్ డీఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిరిధిలోని మేడిచెట్టుతండా గ్రామపంచాయతీలో గుడుంబా, గంజాయిని విక్రయం పై తాండ వాసులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుడుంబా, గంజాయికి అలవాటు పడి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని తెలిపారు. ఎవ్వరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్ఎచ్పిఎస్ నాయకులు సూర్య నాయక్ గ్రామాలలో లైసెన్స్ లేని బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తూ మద్యానికి బానిసలుగా చేస్తున్నారని వాటిపై ఎక్సైజ్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిఐ ధనుంజరు రెడ్డి, ఎక్సైజ్ సిఐ సైదులు, ఎక్సైజ్ ఎస్ఐ శ్రావణ్, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ మణికి బాయి, మాజీ ఎంపీటీసీ రవి నాయక్, చాందీ బాయి, మణికి బాయి, సుమనమ్మ, లక్ష్మీ బాయి, దేవులి బాయి, నీలి బాయి, రుక్కి బాయి, రూకలి బాయి, రాంజ్య నాయక్, రవి నాయక్ ,హర్యా నాయక్,కిషన్ నాయక్,రమేష్ నాయక్,శంకర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.