Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు కొండంత అండ అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. పరిగి నియోజకవర్గంలోని 41 మంది ఇటీవల అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నారు. వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 26,81,500 రూపాయలను మంజూరు చేయించి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వారికి అండగా నిలిచారని అన్నారు. నేడు సంక్షేమ పథకాలు ఏదో రకంగా ప్రతి గడపకు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, ఎంపీపీ అరవిందరావు, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు అంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.