Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ.1కోటి 70 లక్షలతో తుక్కుగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-మహేశ్వరం
తుక్కుగూడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో రూ.1 కోటి 70 లక్షలతో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, వైకుంఠధామం అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. పట్టణు, పల్లెప్రగతి ద్వారా గ్రామాలు పరిశుభ్రతతోని దర్శనమిస్తున్నాయని ఆమె అన్నారు. పట్టణాల్లో నాలలతో పాటు తాగునీటి అవసరాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారని ఆమె అన్నారు. కార్యక్రమంలో చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి కమిషనర్ జ్ఞానేశ్వర్ కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, బూడిదతేజస్విని శ్రీకాంత్ గౌడ్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బోధయాదగిరిరెడ్డి, జాపాల భావన సుధాకర్, బాకివిలాస్ మున్సిపాలిటీ అధ్యక్షులు జల్లెల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షులు సామ్యూల్రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మబాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.