Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య
నవతెలంగాణ-యాచారం
మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె కార్మి కులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య కోరారు. బుధవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కు ఆశ వర్కర్లతో కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరి స్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సమ్మెను కార్మికులంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.