Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మౌత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారికి రథోత్సవం (తేరు) నిర్వహించారు. బుధవారం ఉదయం సామూహిక కుంకుమార్చనలు, ప్రభలు తిప్పి లంకాదహనం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ శివశంకర్ వరప్రసాద్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లట్టుపల్లి రాజ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ కాడెమోని శ్రీశైలం, ఉపసర్పంచ్ రాజమోని తిరుపతి, కార్యనిర్వాహణ అధికారి మోహన్ రావు, అర్చకులు రామాచార్యులు, గోపాలాచార్యులు, రామా నుజాచార్యులు, వివిధ పార్టీల నాయకులు, ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.