Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలి
- సీఐటీయూ నాయకులు జగదీష్, కిషన్
- దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-ఆదిభట్ల
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరూ ఖండించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.జగదీష్, కిషన్ డిమాండ్ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం ఆదిభట్ల మున్సిపాలిటీ పారిశ్రామిక ప్రాం తంలో ప్రచార జీపుజాతను నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్, కిషన్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో కార్మికులను కీలుబొమ్మలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిం చారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలకు తూట్లు పొడుస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను మారుస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఎంతోమంది కార్మికులను రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబానీ, ఆదానీల వంటి పారి శ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెడుతోందని దుయ్యబట్టారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించ కుండా వారిని శ్రమ దోపిడీకి గురిచేస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఉపాధి కరువై దిక్కు తోచని స్థితిలో అల్లాడుతున్నా పట్టించుకున్న పాపాన పోవడంలేదన్నారు. ఎన్నికల సమయంలో చదువు కున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటి వూసే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఓవైపు నిత్యవసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతుంటే సగటు మానవుడు బతకడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలుచేసి చిత్తశుద్ధిని చాటు కోవాలని హితవు పలికారు. కార్మికులు ఎదుర్కొ ంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 28, 29 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుగ ్గరాములు, నాయకులు ఎల్లేశ్, యాదగిరి, బాలరాజ్, బిక్షపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.