Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తులో భూములకు అధిక ధరలు
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ.2కోట్ల14 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-కందుకూరు
బేగరికంచే గ్రామ రూపురేఖలు మారబోతు న్నాయని, ఈ ప్రాంతం మరో మణికొండగా మార బోతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బేగరి కంచే గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఢిల్లీ సరళమ్మ పాండు, ఎంపీటీసీ కాకి రాములు ఆధ్వర్యంలో రూ.2 కోట్ల14 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫార్మాసిటీ ప్రారంభించిన తర్వాత , ఈ ప్రాంత భూములకు అధిక రేట్లు పెరుగుతాయన్నారు. రైతు లు ఎవ్వరు తమ భూములను విక్రయించుకోవద్దని సూచించారు. పీవోటీ భూమలు కోల్పోయిన వారికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి హరిహరన్ అందెట్టు చూస్తామన్నారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికే కాకుండా, పట్టా పాస్‌బుక్కులు లేకుండా, సర్టిఫికెట్లు ఉన్నవారికి కూడా పరిహారం అందే విధంగా కృషి చేస్తా మన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలకు నిధులు అందించనున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల నీరు రావడం ద్వారా సర్పంచులకు, గ్రామస్తులకు సమస్యలు లేకుండా ఉందన్నారు. ఉద్యోగులకు త్వరలో నోటిఫికేషన్లు వెలువ డతాయనీ, తుక్కుగూడలో ప్రభుత్వం తరపున ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలమన్నారు. విద్యా శాఖలో 25వేల పోస్టులు ఉన్నాయని వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో 91 వేల ఉద్యోగాలను ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్పర్సన్ సురసాని వర లక్ష్మి సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ దేవరశెట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కపాటి పాండు రంగారెడ్డి,సురేందర్‌రెడ్డి, లక్ష్మి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మన్నె జయేందర్, సర్పంచులు కాకి ఇందిరమ్మ, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ పొట్టి ఆనంద్, సామ ప్రకాష్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్‌గౌడ్, సర్పంచ్ గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, పాకి దశరథ, నాయకులు చిర్ర సాయిలు, గంప శేఖర్ ఎగ్, మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, ఎట్లా బాబురావు, గుయ్యని సామయ్య, దేవల నాయక్, కాకి నరసింహా, కాకీ రవీందర్, సదానందం గౌడ్, అందుగుల సత్యనారాయణ, డాక్టర్ జంగయ్య, పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.