Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక మహిళా జిల్లా కన్వినర్ కవిత
- తలకొండపల్లిలో జీపుజాత ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతి ఘటించాలని శ్రామిక మహిళా జిల్లా కన్వినర్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కవిత అన్నారు. ఈనెల 28, 29 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి బుధవారం తలకొండపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జీపు జాత ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతూ, పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, నిరుపేదల నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. కార్మిక, కర్షక చట్టాలను మార్చి రైతులను, కూలీలు పట్ల వివక్ష చూపుతుందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా నిర్వ హిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సిఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు, ఆమనగల్ కడ్తాల్ మండలాల బాధ్యులు గుమ్మడి కురుమయ్య మాట్లాడుతూ తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన జీపుజాత వెల్జాల్, చౌదరపల్లి, గట్టు ఇప్పలపల్లి, వెంకట్రావ్ పేట్, పడకల్, చుక్కాపూర్, ఆమనగల్, కడ్తాల్, కందుకూర్ మండలాల మీదుగా మహేశ్వరంలో ముగుస్తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఏ.శేఖర్, పి.లాలూ నాయక్, ప్రజా సంఘాల నాయకులు దుబ్బ చెన్నయ్య, పోచయ్య, పంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, రైతులు పాల్గొన్నారు.