Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయదుర్గం సహకార పరపతి సంఘం చైర్మెన్ పురం అరవింద్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
రాయదుర్గం సొసైటీ భవన నిర్మాణానికి తీర్మానించినట్టు రాయదుర్గం సహకార పరపతి సంఘం చైర్మెన్ పురం అరవింద్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాయదుర్గ సహకార నిర్వహించిన సర్వసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో శ్రమిస్తుందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో సొసైటీ భవనానికి రూ.9 లక్షల 33 వేలతో నిర్మాణ పనులు చేపడుతున్నట్టు చెప్పారు. అదేవిధంగా రాయదుర్గం నూతన భవన భవనం నిర్మాణానికి 500 చదరపు గజాలలో రెండంతస్తుల భవనాన్ని నిర్మించడానికి నాబార్డు ఆర్థిక సహాయంతో హెచ్‌డీసీసీ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడానికి సమా వేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వివరించారు. సొసైటీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ కాట్నే నరసింహా, డైరెక్టర్లు చందంపేట రాములు, అందెల కృష్ణగౌడ్, తుల్జారామ్సింగ్, బద్దు రామ్, కుమ్మరి ఎల్లయ్య, శ్రీశైలం, జంగయ్య, జైపాల్‌రెడ్డి, లక్ష్మణ్, ఒగ్గు అంజయ్య, చిలుకూరు లావణ్య, సీఈఓ బండి గోపాల్, సిబ్బంది, సందీప్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.