Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ చెక్కులు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్దిదారులకు రూ.22 లక్షల 2 వేల 252ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆడ పడుచులకు మేనమామగా కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్నారని అన్నారు.గత 70 ఏండ్ల పాలనలో నిరుపేదలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుం దన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వి ని యోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, చేవెళ్ల తహసీల్దార్ అశోక్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీ టీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.