Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు అబ్బాస్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు అబ్బాస్ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రెండవ రోజు కాటేదాన్లో సమ్మె విజయవంతంగా కొనసాగింది. అనంతరం కాటేదాన్ సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు కార్మికులు, కర్షకులు కూలీలు ఈ సమ్మెలో పాల్గొన్నారని వివరించారు.బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తూ , పెట్టు బడి దారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి,కార్మికుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తోందని ద్వజమెత్తారు. కార్మికుల సమస్యలు పరిష్కా రమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ కాటేదన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి శంకర్, సీఐటీయూ నాయకులు భాస్కర్, కిషోర్, యాదమ్మ సువార్త, ప్రభు, మల్లేష్, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.