Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -దోమ
వికారాబాద్ జిల్లాలో బాలికపై లైంగికదాడి చేసి, హత్య చేసిన నిందుతులను వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఆల్ ఇండియా కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన దోమ మండల కేంద్రంలో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశంలో చట్టాలు ఎన్ని ఉన్న కొందరు మగళ్లు మహిళలు, చిన్నారులపై అగాయిత్యాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారన్నారు. సోమవారం పూడుర్ మండలంలో పదవ తరగతి చదువుకుంటున్న బాలిక బహిర్భుమికి వెళ్లిన క్రమంలో కొందరు వ్యక్తులు అత్యాచానికి పాల్పడి, హత్య చేయడం అత్యంత దారుణం అన్నారు. వెంటనే అత్యాచారం, హత్య చేసిన నిందుతులను పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యచారాలు అడ్డకట్ట వేసేందుకు పోలిసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోజు రోజు అత్యచార ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పోలీసుల పాత్ర కీలకంగా ఉండాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగిన వెంటనే నిందుతులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.