Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు కార్మికులు, కర్షకులు కూలీలు మణికొండ మున్సిపల్లోని లక్నొహిల్స్లో నిర్వహించారు. సీఐటీయూ గండిపేట మండల కన్వీనర్ రుద్ర కుమార్, ఎస్ఎప్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కు లను తప్పులను కాలరాస్తుందన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల నడ్డివిరిచే విధంగా వ్యవహరిస్తోంది. మాటల్లో జాతీయత దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ ఆచరణలో విధ్వంసకరమైన విధానాలను అమలు చేస్తున్నది. పార్లమెంట్లో తమకున్న బలంతో కార్మిక వ్యతిరేక నిరంకుశ చట్టాలను నిరంతరంగా ఆమోదించుకొని ప్రజా ఉద్యమాలపై రాజ్యాంగ బద్దంగా పౌరుల హక్కులను సైతం పాత్రేస్తున్నది. మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ కార్మికులకు జీఓ నెం 60 సవరించి 11 పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 26000 చెల్లించాలిని కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు. పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 20లక్షలు ఏక్షగ్రేషియా చెల్లిం చాలని అన్నారు. దేశంలో జాతీయ సహజ వనరులు ప్రభుత్వరంగ సంస్థలు జాతీయ రహదారులు రైళ్లు విద్యుత్ సబ్ స్టేషన్లు, చమురు, బొగ్గు గనులు, టెలికాం టవర్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎల్ఐసి అన్నిటినీ విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇంకా కార్మిక లోకాన్ని చైతన్యం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంజీనిరింగ్ కళాశాల ఎంప్లాయిస్ యూనియన్ సుబ్బారావు, సీఐటీయూ ఎంమహిపాల్ యాదవ్, అహిమ్మద్ ,బాబు, రవి, యాదగిరి, సుభాష్, జగన్, రామజనేయులు, చంద్రకళ, కమలమ్మ, జంగమ్మ, సబిత, భాగ్యమ్మ, నాగమ్మ, లక్ష్మీనారాయణ, మున్సిపల్ కార్మికుల పాల్గొన్నారు.