Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సి. పార్థసారథి
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
చారిత్రక వారసత్వ సంపదకు, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ ప్రతీక అని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ సి. పార్థసారథి అన్నారు. కల్చరల్ టీవీ, మన టీవీ అంతర్గాల వేదికగా న్యూయార్క్ తెలంగాణా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఉగాది, శ్రీరామనవమి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణా మట్టిని తాకితే మానవత పరిమళిస్తుందని, రాళ్ళను తాగితే రాగాలు పలుకుతాయన్నారు. మనిషిని తాకితే పోరాట పటిమ కనిపిస్తుందని అలాంటి వారసత్వానికి ప్రతీకలైన తెలంగాణ బిడ్డలు అమెరికాలో మూలాలు మరువకుండా సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయని అన్నారు. కార్యక్రమంలో నైటా బోర్డ్ డైరక్టర్లు, అడ్వయిజర్లు, డోనార్లు, ఎగ్జిక్యూటివ్ టీం తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆద్యంతం న్యూయార్క్ వాసులనే కాకుండా అమెరికా వాసులను ఉర్రూత లూగించిన వివిధ కార్యక్రమాలలో లోకల్ సెగ్మెంట్ ను నిర్వహించిన గీత కంకణాల గారిని, కార్యక్రమల రూపకల్పన నిర్వహణలో భాగం పంచుకున్న గీత సింగిరికొండతో పాటు పాలుపంచుకున్న అందరు ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఒగ్గుకథ, శ్రీరామనవమి ప్రత్యేక పాటలు, ప్రఖ్యాత స్టాండప్ కామెడియన్ శ్యామ హారిని ప్రత్యేక హాస్య కదంబం, జీ సరిగమప ఫేంలు సమర్పించిన సంగీత విభావరి, సురేఖామూర్తి పాడిన లతామంగేష్కర్ గీతాలు అందర్నీ ఎంతో ఆకట్టుకున్నాయి.