Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సింధూ బాచుపల్లి మమత కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తుంది. ఈ నేపథ్యంలో సింధూ ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా స్థానిక నాయకుల చేతులమీదుగా సింధూ విద్యాభ్యాసం కోసం రూ.15వేలు ఆర్థికసాయం అందజే శారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జర్పుల గోపాల్ నాయక్, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య, రాంపూర్ ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు తిరుమణి ఆంజనేయులు గౌడ్, నరసింహ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.