Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల రక్షణకే కార్డెన్ సర్చ్
- తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీని పోలీసులు నిర్బంధిం చించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి పోలీసులు నిర్భంద తనిఖీలను కొనసాగించారు. కాలనీలోని 135 ఇండ్లును తనిఖీ చేసి ఇంటి యజమానుల వివరాలు, అద్దెకు ఉంటున్న వారి వివరాలను పరిశీలించారు. అనుమానుతుల గురించి ఆరా తీశారు. ఆధార్ కార్డులు పరిశీలించారు. రెండు గంటలకు పైగా సాగిన నిర్భంద తనిఖీలలో 108 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 91 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు, 8 కార్లు ఉన్నాయి.ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలతో పాటు ప్రజా సరంక్షణే పోలీసుల ధ్యేయమన్నారు. నేరాల నియంత్రించేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్‌లో అదుపులోకి తీసుకున్న వాహనాల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించి వదిలేస్తామన్నారు.సరైన పత్రాలు లేని పక్షాన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ రాంబాబు, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు అబ్దుల్ రవూఫ్, అరవింద్ కుమార్, మధసూధన్ రెడ్డి, కౌన్సిలర్లు అస్లాం, భీంసింగ్, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.