Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్సాపూర్లో శిక్షణా శిబిరం
నవతెలంగాణ- కొడంగల్
ఎన్ఎస్ఎస్తో సామాజిక సేవ ఏర్పడుతుందని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ అన్నారు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో ఎన్ఎస్ఎస్ కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏడు రోజుల ప్రత్యేక వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రాజారాం, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ సమాజ సేవ ద్వారా విద్యార్థి సర్వతోము ఖాభివృద్ధి సాధించాలన్నది ఎన్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. ఎన్ఎస్ఎస్లో చేరిన విద్యార్థులకు సామాజిక బాధ్యత, అన్నింటికీ మించి చక్కటి క్రమశిక్షణ అలవడుతుంద న్నారు. ప్రతి పాఠశాల స్థాయి నుంచి ఎన్ఎస్ఎస్ ఏర్పా టు చేయడం ద్వారా ఒక బాధ్యత పౌరులను సమాజానికి అందించిన వాళ్లమవుతామని వెల్లడించా రు. క్రమశిక్షణతో కూడిన జీవితం కోరుకునే యువత ఎన్ఎస్ఎస్లో తప్పక చేరాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సోమల నాయ క్, సర్పంచ్ సయ్యద్ అంజాద్, పీఏసీఎస్ చైర్మెన్ కటకం శివకుమార్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, కళాశాల అధ్యాపకులు రెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.