Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ టేకుల సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రైతులకు భరోసా కలుగుతోందని ఉప్పరిగూడా పీఏసీఎస్ చైర్మెన్ టేకుల సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శేరీగూడ సమీపంలోని సహకార సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్య క్రమాలను తీసుకువచ్చిందన్నారు. రుణమాఫీ, రైతుబం ధు, రైతు బీమా వంటి పథకాలు రైతుకు భరోసా కనిపి స్తున్నాయని చెప్పారు. సహకార సంఘంలో దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రుణమాఫీలో ప్రభుత్వం పారదర్శకత పాటించడం లేదన్నారు. ఎన్ని కల ముందు చేసిన వాగ్దానం నేటికీ రుణమాఫీ ఎందు కు చేయడం లేదని పలువురు రైతులు ప్రశ్నించారు. రైతు ఆధారంగానే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు కుటుంబంలో ఒకరికే రుణమాఫీ అనడం సబబు కాదన్నారు. బంగారంపై ఇతర బ్యాంకుల కంటే అధికంగా సొసైటీలోవడ్డీని వసూలు చేస్తున్నారని రైతులు గుర్తు చేశారు. రైతులు అధిక వడ్డీ భరించాల్సి వస్తోందన్నారు. వెంటనే రైతుల డిమాండ్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ క్యామ శంకర్, డైరెక్టర్లు ఎదుళ్ల పాండు రంగారెడ్డి, ఎదుళ్ళ జంగారెడ్డి, సీతయ్య, బొమ్మకంటి అశోక్, మేడిపల్లి పుల్లయ్య, సుబ్బరి జంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గుర్రం సుధాకర్‌రెడ్డి, సీఈవో గణేష్, రైతులు, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.