Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బంట్వారం
పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరుతున్నట్టు మండలం తోర్మామిడి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ మాజీ మైనార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖదీర్పాషా తెలిపారు. ఆయనతో పాటు, టీఆర్ఎస్కి చెందిన మందుల అన్వర్మియా, వివిధ పార్టీలకు చెందిన 10మంది మైనార్టీ నాయకులు మంగళవారం మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ మంత్రి వారికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, వెంటనే అన్వర్ మియాకు జిల్లా బీజేపీ మైనారిటీ అధ్యక్షునిగా నియమించినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పార్టీ లోకి తమను ఆహ్వానించినందుకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు.