Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు జక్క రాంరెడ్డి
- ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
తెలుగోడి ఖ్యాతి ప్రపంచానికి చాటిన తెలుగుదే శం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావులకే దక్కిందని ఇబ్రహీంపట్నం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు జక్క రాంరెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు జక్క రాంరెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్టపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాల యం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి ఎన్నో నూతన సంస్కర ణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ ఆశయ, సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిలమొని రవీందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంచాల మండల మాజీ ఎంపీపీ, భువనగిరి పార్లమెంట్ యూత్ అధ్యక్షులు జక్క కర్ణాకర్ రెడ్డి, కృష్ణ, మంచాల మండల అధ్యక్షులు చింతకింది చక్రపాణి, కాసోజు వీరాచారి, బొమ్మకంటి అశోక్, అంజయ్య, ప్రభాకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.