Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
బాల్య వివాహాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని కరణ్ కోట ఎస్సై మధుసూదన్ రెడ్డి అ న్నారు. సోమవారం రాత్రి కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మండలంలోని వీరు శెట్టిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులపై అవ గాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ .. బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని అన్నారు. ప్రతి గ్రామంలో నిఘా నేత్రాల ఏర్పా టు కు కృషి చేయాలని అన్నారు. అంతేగాకుండా ఆన్లైన్ మోసగాళ్లతో ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఫోన్లకు వచ్చిన ఓటీపీలను చెప్పవద్దన్నారు. ఖాతాకు సంబంధించిన ఏమైనా అవసరముంటే నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలని అన్నారు. బాల్యవివాహాలు నేరమని ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేపడితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగప్ప గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.