Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన డివిజన్ ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి కమిటీని నియమించారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్‌తో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని ఓబీసీ మోర్చా కమిటీలో నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఓబీసీ మోర్చా డివిజన్ కమిటీలో నియమితులైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హౌదా దక్కిందన్నారు. బీసీలకు నిధులు కేటాయించకున్న భారీగా నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటూ ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి కేవలం 10% మాత్రమే ఖర్చు చేస్తూ ఏడేండ్లుగా బీసీలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చ రించారు. నిరుపేదలైన బీసీలందరికీ బీసీ బంధు ఇవ్వా లన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలం తా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఓబీసీ అసెంబ్లీ కన్వీనర్ పృథ్విగౌడ్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధరరావు, నాయకులు రవిగౌడ్, కోటేశ్వరావు, ఉపాధ్యక్షులు అశోక్, రవిముదిరాజ్, మల్లేష్, నవీన్ కుమార్, రామారావు, నాగలక్ష్మి, జానీ, రామచంద్రుడు, రవి, ఆంజనేయులు, సత్యం, చంద్రశేఖర్, గోపి, మహేష్, నరసింహరావు, రుద్రవీర్, మధు, నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.