Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రెండవ రోజు చేవెళ్లలో ఏఐటీయూసీ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన,ర్యాలీ, రాస్తారోకో,సమావేశం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య, ఏఐటీ యూసీ రాష్ట్ర సమితి సభ్యులు కె.రామస్వామి, ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండో సారి వచ్చిన తరువాత కార్మిక వర్గంపై దాడి చేయడం మొదలు పెట్టిందన్నారు. పోరాడిసాధించుకున్న 44 రకాల చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడ్లుగా మార్చి కార్మికవర్గానికి తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలను తీసుకురావాల్సిన ప్రభుత్వాలే సంక్షోభాన్ని సృష్టి స్తున్నాయని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు సుబాన్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సీపీఐ మండల కార్యదర్శి సుధాకర్ గౌడ్, మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు వడ్ల మంజుల, మాధవి, గ్లాస్ కంపనీ కార్మికులు ఇంద్రారెడ్డి, జబ్బార్ శ్రీను, రంజిత్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.