Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రెండవ రోజు రాజేం ద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ నుంచి హైదర్ గుడ చౌరస్తా వరకు ఏఐటీయూసీ, సీపీఐ, టీిఆర్ఎస్వికె ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సింగ్, రావు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనం పల్లి జైపాల్‌రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చెన్నయ్య, హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ కార్మిక వర్గంపై దాడి చేయడం మొదలుపెట్టిందన్నారు. 44 రకాల చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడ్ లుగా మార్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందన్నారు. పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎంఏ రియాజ్, ఏటీయూసీ మండల కార్యదర్శి టి.ఆనంద్, మండల నాయకులు సాయిలు, నరసింహ, మల్లేష్, జయమ్మ, కృష్ణ, రాజు, శ్రీను, పద్మమ్మ, కార్మికులు పాల్గొన్నారు.