Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో కార్యాలయంలో వినతి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు
- సీఐటీయూ నాయకులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొనసాగిన దేశవ్యాప్త కార్మికుల సమ్మె రెండో రోజు కూడా తాండూ రులో విజయవంతంగా కొనసాగింది. కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణ కేంద్రంలో పురవీధులలో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అన ంతరం తాండూరులో ఆర్డీవో కార్యాలయంలో కార్మికు ల సమస్యల పరిష్కారానికి వినతిపత్రాన్ని అందజే శారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు శ్రీని వాస్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదలే అమ్ముకోవడానికి చూస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రా ములు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బరితెగించి పరిపాలన చేస్తున్నదని మాటల్లో జాతీ యత దేశభక్తి కబుర్లు చెబుతూ జాతీయ సహజ వన రులు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొ రేట్లకు వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, కేవీపీస్ జిల్లా నాయకులు ఉప్పలి.మల్కయ్య, ఎస్ఎఫ్ఐ నాయ కులు మహేష్, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు భీమప్ప, కార్యదర్శి బాలప్ప, అంగన్వాడీ నాయకులు సుజాత, జయంతి, లక్ష్మి,రాజేశ్వరి స్వరూపా సుధా విజయలక్ష్మి పాల్గొన్నారు.