Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
ప్రతి ఒక్కరూ సహకార సంఘం అభివృద్ధికి సహకరించాలని జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని షాబాద్ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో గురువారం పీఏసీఎస్ చైర్మెన్ చల్లా శేఖర్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మెన్ చల్లా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... మొదట సంఘంలోని లావాదేవీలు, గోల్డ్‌లోన్, ఎలీలోన్ వాటి వివరాలు తెలిపారు. అదే విధంగా ఎరువులు, ధాన్యం సేకరణపై వచ్చిన లాభాలను తెలియజేశారు. జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి మాట్లాడుతూ షాబాద్ సహకార సంఘం జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. పీఏసీఎస్‌కు షాబాద్, హైతాబాద్‌కు నూతన భవనాలు ఏర్పాటు చేశామన్నారు. సర్దార్ నగర్ రూ.1కోటి 70 లక్షల నిధులతో కోల్డ్ స్టోరేజి నిర్మిస్తున్నామని చెప్పారు. సహకార సంఘం అభివృద్ధి చేసే ప్రతి పనికీ అందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మెన్ మద్దూరి మల్లేష్, నాయకులు కోట్ల మహేందర్‌రెడ్డి, మతీన్, జడల రాజేందర్ గౌడ్, నక్క శ్రీనివాస్ గౌడ్, పొన్న నర్సింహారెడ్డి, నర్సింగ్‌రావు, ఈదుల నర్సింహులుగౌడ్, శ్రీరాంరెడ్డి, వెంకటాదవ్, శ్రీనివాస్ డైరెక్టర్లు పర్వేద నర్సింహులు, గోపాల్ రెడ్డి, రాజరత్నం, రైతులు తదితరులు ఉన్నారు.