Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ కోట్ల మహిపాల్
నవతెలంగాణ-కొడంగల్
విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు రావాలని జడ్పీటీసీ కోట్ల మహిపాల్ అన్నారు. గురువారం కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు రావాలనీ, దానికి నాంది కళాశాలలోనే ప్రారంభమవుతుందన్నారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతం అభివద్ధి పథంలో మరింత దూసుకుపోవాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ప్రాంత అభివద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ఎన్ఎస్ఎస్ లాంటి వేదికలు దోహదపడతాయని అన్నారు. విద్యతో పాటు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు, సజనాత్మకతను వెలికి తీస్తాయాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సయ్యద్ అంజాద్, ఎంపీటీసీ. ఉప సర్పంచ్ ,కళాశాల అధ్యాపకులు సోమ్లా నాయక్, రెడ్డి శ్రీనివాస్ ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.