Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం డిమాండ్
నవతెలంగాణ-చేవెళ్ల
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం డిమాండ్ చేశారు. గురువారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు వెంకటస్వామి, షాబాద్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, నవాబ్‌పేట మండలాధ్యక్షులు వెంకటయ్య తదితరులతో కలిసి చేవెళ్లలో విద్యుత్ సబ్ స్టేషన్ షన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, భీమ్ భరత్ తదితరులు మాట్లాడారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పీసీసీ కార్యదర్శి రామ్‌రెడ్డి, షాబాద్ ఆంజనేయులు షాబాద్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, నవపేట్ మండలాధ్యక్షులు వెంకటయ్య, పీఎసీఎస్ చైర్మెన్ బుచ్చిరెడ్డి, చేవెళ్ల ఎంపీటీసీ రాములు, ఎంపీటీసీ ఇక్బాల్, చెన్నయ్య, మాజీ సర్పంచులు ప్రభాకర్, నర్సింలు, అనంత రాములు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మధ్యల శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భార్గవ్ రామ్, ప్రయివేట్ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈదులపల్లి రాములు, మండల ఉపాధ్యక్షులు పాండుయాదవ్, సత్యనారాయణ, ఎర్రగోపాల్, రైతు సంఘం మండలాధ్యక్షులు కమ్మేట కృష్ణగౌడ్, ఎంకేపల్లి ఉపసర్పంచ్ మైపాల్ రెడ్డి, దామర్ల పల్లె మాజీ సర్పంచ్ యాదయ్య, ఎస్సీసెల్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బి. శ్రీనివాస్, అల్లవాడ సత్యానందం, ఆలూరు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.