Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని చిప్పలపల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మకు రూ.35000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు ,బలహీన, వర్గాలకు చెందిన ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉప యోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. కందుకూరు మండలాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధికి బాటలు వేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు సురమోనికుమార్, ఏ. పాండుగౌడ్, తాళ్ల కార్తీక్, మల్లేష్, మోహన్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.