Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. కోటీ 92 లక్షల 53 వేల ఎల్టి రుణాల చెక్కులు
- 32 మంది లబ్దిదారులకు అందచేత
- లాభాల బాటలో యాలాల సొసైటీ
- సకాలంలో రైతులకు రుణాలు ఇస్తాం
- యాలాల సోసైటీ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు,
- ఆ సంఘం చైర్మెన్ గుర్రాల సురేందర్ రెడ్డి
నవతెలంగాణ- యాలాల
యాలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2022- 23 ఏడాది అంచన బడ్జెట్ రూ. 8 కోట్ల 75 లక్షలు ఖర్చు పెట్టడం కోసం ఆమోదం తెలిపినట్టు ఆ సంఘం చైర్మెన్ గుర్రాల సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం యాలాల సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని సీఈఓ బీరప్ప, ఆ సంఘం అధ్యక్షులు జి.సురేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు హాజరుయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఫర్టీలైజర్, సీడ్స్, విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జుంటిపల్లి, రాస్నం, బాగాయిపల్లి, లక్ష్మీనారాయణ పూర్ జీపీలలో ఫర్టీలైజర్, సీడ్స్, విత్తనాల విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఫర్టీలైజర్, సీడ్స్, యాలాల సోసైటీ ద్వారా విక్రయించగా వచ్చిన లాభం రూ. 48 లక్షలు వచ్చాయని సొసైటీని ఆయన అభినందించారు. పాలకవర్గం సమన్వయం తో ప్రతి అంశాన్ని కూలంకుశంగా చర్చించి సోసైటీని మరింత లాభాల భాట పట్టించాలని అకాక్షించారు. సంఘం చైర్మెన్ జి.సురేందర్ రెడ్డి మట్లాడుతూ.. 2022- 23 ఏడాది యాలాల సొసైటీకీ సంబంధించిన అంచన బడ్జెట్ రూ. 8 కోట్ల 75 లక్షలు ఖర్చు పెట్టేందుకు ఆమోదం తెలుపగా అందులో స్వల్పకాలిక అప్పలకు గాను రూ.3 కోట్లు, దీర్ఘకాలిక అప్పలకు గాను రూ. 2 కోట్లు, బంగారు రుణాలకు రూ. 3 కోట్లు, కాగా ఎరువుల వ్యాపారం చేయడానికి రూ. 50 లక్షలు, సంఘం నిర్వాహణ ఖర్చులు రూ. 25 లక్షలు కేటాయించినట్టు వివరించారు. అదే విధంగా ఈ ఏడాదికి సంబంధిం చి ఎల్టి రుణాలు పొందిన 32 మంది లబ్దిదారులకు గొర్రెలు, గేదెలు పెంపకం దారులకు మాత్రమే కాకుండా ఫౌల్ట్రీ ఫారాలు, ట్రాక్టర్లు, డైరీ ఫాంలకు గాను రూ.కోటీ 92 లక్షల 53 వేల విలువైన చెక్కు లను వారు అందజేశారు. ప్రభుత్వం, పాలక వర్గం సహకారంతో రైతులకు సకాలంలో రుణాలు ఇస్తామ ని చెప్పారు. ఉగాది పండుగ తర్వాత దౌలాపూర్ జీపీ పరిధిలో రూ. 2 కోట్ల నాబర్డు నిధులతో నూతన యాలాల సోసైటీ గోదాం నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. యాసంగిలో సాగు అవుతున్న వరి ధాన్యాన్ని తప్పని సరిగా కేంద్ర ప్రభు త్వమే కొనాలని సొసైటీ అధ్వర్యంలో తీర్మానించారు. కేంద్రం మొండి వైఖరిని ప్రదర్శించకుండా దిశగా వరి రైతులకు న్యాయం చేయలని చెప్పారు. సోసైటీ వైస్ చైర్మెన్ వడ్డే రాములు, మాజీ చైర్మెన్ సిద్రాల శ్రీనివాస్, సీఈఓ బీరప్ప ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మెన్ అనంతయ్య, డైరెక్టర్లు వెంకటయ్య, సంగారెడ్డి, అశోక్‌రెడ్డి, చెన్నయ్య, శ్రీహరి, అనంతమ్మ, ఎల్లమ్మ, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పి.బీమప్ప, సర్పంచ్ పటేల్ రెడ్డి, అగ్గనూర్ ఎస్ఎంసీ చైర్మెన్ యు. వెంకటయ్య, వివిధ గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.