Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులో పుస్తకాలు
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- వికారాబాద్ గ్రంథాలయంలో స్టడీ హాల్ ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధ్ణి
నిరుద్యోగ యువత కోసం గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు కు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ హాల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలు గా 80 వేల ఉద్యోగాల నియామకానికై నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అదేవిధంగా 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 గ్రంథాలయాలకు గాను 110 గ్రంథాలయా లలో పోటీ పరీక్షకు సంబంధించిన వివిధ పుస్తకాల ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయిం చిందని మంత్రి తెలిపారు. పేద మధ్యతరగతి నిరుద్యోగ యువతకు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు ఇవి ఎంతగానో దోహద పడతాయని ఆమె అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత గ్రంథాలయాలలో ఇంకా ఏమైనా స్టడీ మెటీరియల్ కావల్సి వస్తే సూచించాలని తెలిపారు. ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. నియోజకవర్గాలలో పోటీ పరీక్షలకు శాసనసభ్యులు ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు తోడ్పాటును అందించేం దుకు ముందుకు వస్తున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్రతి ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 'మన ఊరు-మనబడి కార్యక్రమం' కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం 7 వేల కోట్ల నిధులను కేటాయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేష్‌రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చైర్మెన్ మురళీకృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ విజరుకుమార్, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.