Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్
- ఖాళీ సిలిండర్లకు దండలు వేసి పట్టణంలో ఊరేగింపు
నవతెలంగాణ-షాద్ నగర్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయనీ, ఈ రెండు పార్టీలు ఒకే ఒప్పందంతోనే పాలనను కొనసాగిస్తున్నాయని షాద్నగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ అన్నారు.గురువారం షాద్నగర్ పట్టణంలో వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయం నుంచి షాద్నగర్ పట్టణ వీధుల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పట్టణంలో కట్టెల మోపులను మహి ళలు నెత్తిమీద పట్టుకుని, ఖాళీ సిలిండర్లకు దండలు వేసి ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని దుయ్య బట్టారు.గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనీ, అయిదు రాష్ట్ర ఎన్నికల ఉన్నప్పుడు మాత్రం రేట్లు పెంచకుండా, ఎన్నికలు అయిపోయాక రేట్లను పెంచి ప్రజలపై అధిక భారం వేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ అదేవిధంగా కరెంట్ చార్జీలు పెంచడం విష యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామా ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబార్, కొంకళ్ల చెన్నయ్య, పి. రఘు, బాలరాజ్ గౌడ్, ఆశన్న గౌడ్, అందే మోహన్, ఖదీర్, ముబారక్, శ్రీకాంత్ రెడ్డి,చెంది తిరుపతి రెడ్డి, మన్నే రవి, రాఘవేందర్ గౌడ్, సత్తయ్య, అశోక్, సీతారాం, రమేష్, నాగమణి, శ్రీను నాయక్, మాధవులు తదితరులు పాల్గొన్నారు.