Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
- ఎంకేఆర్ ఫౌండేషన్ అభ్యర్థులకు హల్ టికెట్లు అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉగాది నుండి ప్రభుత్వ ఉద్యోగాల పండుగ ప్రారంభమవుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ శిబిరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం హల్ టికెట్లు అందజేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన యువతీ, యువకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది సువర్ణావకాశమన్నారు. సమయాన్ని వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లు, సరదాలకు ఏడాది పాటు దూరంగా ఉండాలని సూచించారు. ఒక్క ఏడాది ప్రణాళిక బద్దంగా కష్టపడితే జీవితమంతా తమ కుటుంబాలు బాగుపడతాయన్న వాస్తవాన్ని యువత గ్రహించలన్నారు. 80,039 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే ఏడాదిలో భర్తీ చేసే సాహసం ఎవ్వరూ చేసే అవకాశం లేదని గుర్తు చేశారు. అది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని చెప్పారు. సమయం వచ్చినప్పుడల్లా యువతకు తగు తోడ్పాటు అందించడానికి ఎంకేఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. గతంలో నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా 386మంది పోలీస్ ఉద్యోగాలు సాధించారని వివరించారు. ఈ నియామకాల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలు సాధించే దిశగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఏప్రిల్ 3న గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు సమయానికి చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, ఫౌండేషన్ కార్యదర్శి జెర్కొని రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు భరత్ రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్, నిట్టు జగదీష్, రాజేష్ గౌడ్, శివ సాయి గౌడ్, విజరు, ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.