Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు
నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లపై ఉన్న 33/11 కెేవీ విద్యుత్ తీగలను తొలగించాలని గురువారం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాతుక దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా ఇండ్లపై నుంచి ఉన్న విద్యుత్తు తీగల వలన అనేక ప్రమాదాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.మరికొంత మంది ఇండ్ల స్థలాల్లో విద్యుత్ లైన్ ఉండటంతో ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రమాదరకంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించి, స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. దానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సానుకూలంగా స్పందించి వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారని తెలిపారు. స్పందించిన విద్యుత్ ఏడి రవీందర్ నాయక్ మున్సిపల్ చైర్పర్సన్ భాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తో కలిసి ఇండ్లపై ఉన్న విద్యుత్ తీగలను ఆయన పరిశీ లించారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ రవీందర్ కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేం దర్ గౌడ్, నాయకులు కమ్మరి జనార్ధన్ చారి, బ్యాగ రి యాదయ్య, జోగు బాల రాజు, ఆంజనేయులు గౌడ్, సిటీ కేబుల్ వెంకటేష్, శ్రవణ్ కుమార్ యాదవ్, రాఘవేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.