Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేతల డిమాండ్
- శంషాబాద్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-శంషాబాద్
పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.గురువారం తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన చేపట్టారు. శంషాబాద్ సబ్ స్టేషన్ కార్యా లయం ఎదుట ధర్నా చేశారు. శంషాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లన గ్రోవిల సంజరుయాదవ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఏడీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నేతలు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్పల్లి నరేందర్ హాజరై, మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రజల నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజాకంటకులుగా మారారని అన్నారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కప్పిపుచ్చడానికి బీజేపీ నాయకులు, రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు దొంగ ధర్నాలు, దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన చేతగాని నాయకులు బడా బాబులకు వత్తాసు పలుకుతూ విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ద్వజమెత్తారు. మోడీ, కేసీఆర్ ఏలుబడిలో దేశం, రాష్ట్రం అధోగతి పాలు అయ్యారని విమర్శించారు. అందుకే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు టీిఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎండగట్టాలని ఉద్దేశంతో వారం రోజుల పాటు కార్యాచరణ తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే గతంలో టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన మాదిరిగానే మళ్లీ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మాజీ ఉపసర్పంచ్ శంశోద్దిన్, మైలారం సులోచన, పీ ఎస్ శ్రీధర్ యాదవ్ , బొబ్బిలి కృష్ణ, సిద్ధులు, జహంగీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.