Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని ఇముల్ నర్వ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన గిరిజన స్కిల్ డెవలప్ మెంట్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణ పూర్తైన తర్వాత స్థానిక యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.స్థానికంగా అనేక పరిశ్రమలు నెలకొన్నాయనీ, యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. గిరిజన స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ యువతకు, మహిళలకు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఇంగ్లీష్, కంప్యూటర్, హౌటల్ మేనేజ్ మెంట్, ప్లంబర్, ఎలక్ట్రిషన్ లాంటి అనేక రంగాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించన్నునట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, సర్పంచ్ అజరు నాయక్, వైస్ ఎంపీపీ శోభాలింగం నాయక్, ఉప సర్పంచ్ శ్రీ రాములు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండే కృష్ణయాదవ్, భాతుక దేవేందర్ యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, లింగం నాయక్, గోపాల్ నాయక్, మిట్టు నాయక్, సిరాజ్, కమ్మరి జనార్ధన్ చారి తదితరులు పాల్గొన్నారు.